దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌పై చీటింగ్ కేసు నమోదైంది. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు.
శివరామ్‌కు చెందిన కైరా ఇన్ ఫ్రా కంపెనీలో 2016లో తెనాలి మండలం పెదరావూరుకు చెందిన యలవర్తి సునీత రూ.26,25,000, పాలడుగు బాలవెంకటసురేష్ రూ. రూ.24,25,000 పెట్టుబడి పెట్టారు. వీరి పెట్టుబడి, అందుకు తగిన ప్రతిఫలాన్ని మరుసటి ఏడాది 2017లో తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి చెల్లించలేదు. అయితే డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రూరల్ ఎస్‌ఐ జి.ఏడుకొండలు శివరామ్‌పై చీటింగ్ కేసును సోమవారం నమోదు చేశారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/