Punna Kailash Netha
తెలంగాణ

పోరాటాల ఫలితమే గట్టుపల్ మండలం

పోరాటాల ఫలితమే గట్టుపల్ మండలం
883 రోజుల అలుపెరగని పోరాటం ,దీక్షలు , ధర్నాలు, రాస్తారోకోలు చేసి ఉద్యమకారులు గట్టుపల్ మండలం సాధించారని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలాష్ నేత అన్నారు.

ఆదివారం నాడు గట్టుపల్ కేంద్రంలో జరిగిన విజయోత్సవ ర్యాలీకి హాజరై ఉద్యమకారులను సన్మానించి స్వీట్లు తినిపించారు .అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం తర్వాత అంతటి గొప్ప ఉద్యమం గట్టుపల్ మండల ఉద్యమం.
అలాంటి స్ఫూర్తి భావి తరాలకు ఆదర్శనీయమని అన్నారు. వెంటనే కార్యాలయాలను ప్రారంభించి ప్రజలకు పాలన సౌలభ్యం కల్పించాలని కోరారు . ఈ ర్యాలీ లో కాంగ్రెస్ నేతలు మోదుగుసత్తిరెడ్డి, బాల్రెడ్డి , పగిళ్ల శంకర్ ,వార్డు సభ్యులు మధగాని ఆంజనేయులు.. కుమార్ వెంకటేష్ శ్రీశైలం నల్లవెల్లి నరసింహ పగడాల రాజు శ్రీశైలం యూత్ కాంగ్రెస్ నాయకులు ఆది నరేందర్ గణేష్ అబ్బాస్ శివ శ్రీకాంత్ ప్రశాంత్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/