మునుగోడు ప్రస్తుత MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరడం దాదాపుగా ఖరారు అయింది. ఈ నేపథ్యంలో మునుగోడు లో ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్ నుండి ఎవరికీ టికెట్ దక్కుతుంది అనే అంశంపై నాలుగు రోజుల క్రితం తెలుగోడు న్యూస్ వెబ్ సైట్ పోల్ నిర్వహించింది. ఇందులో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత కి 1058 (91%) ఓట్లతో ముందంజలో నిలిచారు. బీసీ కులంలో ని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ జేఏసీ లో కీలకంగా పనిచేయడం, విద్యావంతుడు కావడం, స్థానికుడు కావడం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆశీస్సులుండడం, కాంగ్రెస్ లో క్రీయాశీలకంగా పనిచేస్తుండడం కైలాష్ నేత కు అనుకూలంగా మారాయి. రాజగోపాల్ రెడ్డి కి ధీటుగా బలమైన బీసీ అభ్యర్థి ని బరిలో దించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తే పున్న కైలాష్ నేత కి టికెట్ దక్కడం ఖాయం.
మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి కి 90 (8%) ఓట్లు వచ్చాయి, టీ జర్నలిస్ట్ ల ఫోరం అధ్యక్షుడు పల్లె రవి కుమార్ కు 20 (2%) ఓట్లు వచ్చాయి.
Poll URL : Who Will Get The MLA Ticket Form Congress In Munugode Constituency
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/