mulugu
తెలంగాణ రాజకీయం

ములుగులో ముక్కోణపు పోటీ

ములుగు నియోజక వర్గంలో గెలుపుకై పోటీ తీవ్రంగా ఉంది.ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి దనసరి సీతక్క, బీఆర్ఏస్ ఎమ్మెల్యే అభ్యర్ధి బడే నాగజ్యోతి మధ్య పోటీ ఉంది.బీజీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అజ్మీరా ప్రహ్లాద్ ఉన్న కానీ పెద్దగా ప్రభావం చూపడం లేదన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఇకపోతే ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సీతక్క మరల ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయడంతో నియోజక వర్గంలో ప్రజల్లో తనకున్న అభిమానంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.  నియోజక వర్గ ప్రజల సాధక బాధలు,కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా సీతక్క పేరు పొందారు.ప్రజల సమస్యలని అసెంబ్లీ లో గొంతెత్తి వినిపిస్తుంది అనే నమ్మకం ప్రజల్లో ఉండటం అదే విధంగా నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనే ధీమాతో సీతక్క తననే వరిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి నాగజ్యోతి ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్.  ఎమ్మెల్యే గా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. నాగజ్యోతి తొలుత కాల్వపల్లి గ్రామ సర్పంచ్ గా ఏక్రీవంగా ఎన్నికై తర్వాత తాడ్వాయి జడ్పీటిసి గా గెలుపొంది జెడ్పీ వైస్ చైర్మన్ గా ప్రజలకి సేవలని అందిస్తున్న క్రమంలో అప్పటి జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అకాల మరణంతో జెడ్పీ చైర్మన్ కుర్చీ నాగజ్యోతికి వరించింది.

జెడ్పీ చైర్మన్ గా నాగజ్యోతి నిత్యం ప్రజల సమస్యల సాధనపై కృషి చేస్తూ ప్రజల్లో మమేకమైంది. కేసీఆర్ ప్రవేశ పెట్టే పథకాలు తనని గెలిపిస్తాయని అనే ధీమాతో ప్రస్తుతం నాగజ్యోతీ మరల తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే గా గెలిస్తే మంత్రి పదవి ఖాయం అనే సెంటిమెంట్ కూడా నాగజ్యోతికి ఉండటం విశేషం.ఇక బీజీపీ నుండి బరిలో ఉన్న అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ దివంగత మాజీ మంత్రి చందూలాల్ తనయుడు.పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటన కాస్త ఆలస్యంగా రావడం అతనికి కొంత బలహీనం అయ్యింది.గతంలో ప్రహ్లాద్ ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నాడు ఆ ధీమాతో నియోజక వర్గం పై తనకు పూర్తీ అవగాహన ఉందని,ఇక్కడి ప్రజల సమస్యలను తెలిసిన వాడినని చెప్పుకుంటున్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పథకాలు ,రాష్ట్రంలోని ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకత కలిసి వస్తుందనే ధీమాతో ప్రహ్లాద్ ఉన్నారు.కానీ బిజేపికి నియోజక వర్గం ప్రజల్లో  మాత్రం బిజెపి పార్టీ పట్ల ఆసక్తి అంతంత మాత్రమే ఉండటం బిజేపికి కొంత నిరాశ ఉండటం గమనార్హం. ఏది ఏమైనా ములుగు అసెంబ్లీ నియోజక వర్గంలో మూడు ప్రధాన పార్టీల్లో  బలంగా పోటీ నెలకొంది.