జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో నేడు భద్రతా బలగాలు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.జిల్లాలోని క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలు, ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడని వెల్లడించారు. ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/