జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్తగా 20,408 కరోనా కేసులు

యాక్టివ్​ కరోనా కేసులు.. 1,43,384

దేశంలో కరోనా కేసులు రోజువారీ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం మధ్య 20,408 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 20,958 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతానికి చేరింది. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,36,173 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,917 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,07,00,946కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,17,323 మంది మరణించారు. ఒక్కరోజే 8,62,421 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,06,76,713కు చేరింది.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/