జాతీయం ముఖ్యాంశాలు

గుడ్ న్యూస్ : వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది

నెల మారిందంటే గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి చమురు సంస్థలు. కానీ ఈ నెల మాత్రం వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపాయి. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ. 36 మేర తగ్గించినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ తగ్గింపు ధరలు ఈరోజు నుండే అమల్లోకి వస్తాయని తెలిపాయి. ఫలితంగా ఢిల్లీ లో ఇప్పటివరకు రూ.2,012.50గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.1,976కు చేరింది. అంతకుముందు జులై 6న గ్యాస్ సిలిండర్ ధర రూ.8.5 తగ్గింది. ప్రస్తుతం దేశంలో ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి.

  • కోల్​కతా: రూ.2,132.50
  • ముంబయి: రూ.1,972.50
  • చెన్నై: రూ.2,177.50

ఇక గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరలో ఏమాత్రం మార్పు రాలేదు. పాత ధరనే అమల్లో ఉంది. ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీ లో రూ.1053గా ఉంది. కోల్​కతాలో రూ.1079, ముంబయిలో రూ.1052.5, చెన్నైలో రూ.1068.5గా ఉంది. అంతకుముందు వంటగ్యాస్ ధరను జులై 6న సిలిండర్​కు రూ.50 లకు చమురు సంస్థలు పెంచిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/