ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

6న ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు నాయుడు

ఈ నెల 6న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌లో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు వెళ్తున్న చంద్రబాబు.. ప్రధాని మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/