తాడేపల్లి: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై స్పందించారు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అది వాస్తవం కాదని, పోలీసు కేసు కూడా పెట్టానని గోరంట్ల తనతో చెప్పారన్నారు. ఆ విషయంలో నిజంగా ఆయన తప్పు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
‘మా పార్టీ మహిళల పక్షపాత పార్టీ. నిజంగా తప్పు ఉంటే మా నాయకుడు ఊరుకోరు. టీడీపీ రాద్దాంతం చేస్తోంది. మా నాయకుడు చేతల్లో చూపిస్తారు. గోరంట్ల మాధవ్ పోలీస్ కేసు పెట్టారు. వాస్తవాలు తెలియాల్సి ఉంది. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాము’ అని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.