జాతీయం ముఖ్యాంశాలు

బిజెపితో బంధానికి స్విస్తి పలికిన బిహార్‌ సిఎం

పార్టీ నేతల సమావేశంలో నీతీశ్‌ నిర్ణయం..

బిహార్‌ సిఎం, జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌ బిజెపితో బంధానికి స్విస్తి పలికారు. ఎన్డీయే కూటమితో పొత్తును రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈరోజు జేడీయూ పార్టీ నేతల సమావేశంలో నిర్ణయంచినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీహార్‌లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్‌.. బిజెపితో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బిజెపితో సంబంధాలు స‌రిగా లేని కార‌ణంగా.. ఆ కూట‌మికి నేడు గుడ్‌బై చెప్పేశారు నితీశ్‌. బీజేపీ(77)-జేడీయూ(45) కూట‌మి పాల‌న బీహార్‌లో ముగిసిపోయింది.

బిజెపితో తెగ‌దెంపులు చేసుకున్న‌ట్లు జేడీ నేత నితీశ్ త‌మ ఎమ్మెల్యేల‌కు చెప్పారు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్నారు. అయితే ఆర్జేడీ, కాంగ్రెస్‌తో క‌లిసి నితీశ్ కుమార్‌.. కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. నితీశ్ సీఎంగానే కొన‌సాగ‌నున్నారు.

అయితే కొన్ని ఊహాగానాల ప్ర‌కారం ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్‌కు హోంశాఖ ఇవ్వ‌నున్నారు. నితీశ్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీలు మ‌ద్ద‌తు తెలిపిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/