తెలంగాణలోని ఆదివాసీ ల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భవన్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసారు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణలోని ఆదివాసీల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భవన్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. గూడెంలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్ది ఆదివాసీల కళను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చారని పేర్కొన్నారు. జోడేఘాట్‌లో కుమ్రం భీం మ్యూజియంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం జిల్లా అని నామకరణం చేశామన్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/