జాతీయం

బీహార్‌లో అంబులెన్స్‌లు లేక బైకుల‌పై మృతదేహాల త‌ర‌లింపు

బీహార్ రాజ‌ధాని పాట్నాలోని బార్హ్ పట్టణం సబ్ డివిజన్ ఆసుపత్రిలో అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో రెండు కుటుంబాలు మోటారు బైకులపై మృతదేహాలను తీసుకెళ్లారు. ఆసుప‌త్రిలో రెండు అంబులెన్సులు మాత్రమే ఎమ‌ర్జెన్సీ కోనం ఉన్నాయని చెప్పార‌ని, దీంతో మృతదేహాన్ని క‌ప్పి బైక్‌పై శ్మ‌శాన‌వాటిక‌కు తీసుకెళ్లామ‌ని వార్డు స‌భ్యుడు నితీశ్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై వైద్య అధికారిణి డాక్ట‌ర్ విభ కుమారి సింగ్ స్పందించారు. మ‌ర‌ణించిన వారిని త‌ర‌లించేందుకు అంద‌రికీ అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపార‌ని అన్నారు. దీనిపై ద‌ర్యాప్తు చేసి ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా చూస్తామ‌న్నారు.