ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల వలసలు కొసాగుతున్నాయి. తాజాగా మణిపూర్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. రాజ్‌కుమార్ ఇమో సింగ్, యామ్‌తంగ్ హవోకిప్ ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, మణిపూర్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి సంబిట్ పాట్రా సమక్షంలో వారు బీజేపీ కండువా కప్పుకున్నారు.
భారతీయ జనతాపార్టీ 2017లో తొలిసారి మణిపూర్‌లో అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తున్నది. అందుకే ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూ బీజేపీలోకి ఆహ్వానిస్తున్నది.