శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో : 4,38,446 క్యూసెక్కులు..ఔట్ ఫ్లో : 3,36,672 క్యూసెక్కులుగా ఉంది.
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం : 588.00 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ: 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం : 306.1010 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే 2009 తర్వాత మళ్లీ 2022 లో 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు తెలిపారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/