తెలంగాణ

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

రంగారెడ్డి: చందానగర్ పోలీస్ స్టేషన్  పరిదిలో వ్యభిచార గృహం పై ఎస్వోటీ  పోలీసులు దాడులు జరిపారు. ఓల్డ్ ఎంఐజీ ఇంటి నెంబర్ 1546 లో రాజు అనే వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా వ్యబిచారం నిర్వహిస్తున్నాడు. నలుగురు యువతులు, ఇద్దరు విటుల అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార నిర్వాహకుడు రాజు పరారీలో వున్నాడు.  వ్యభిచార గృహంలో పనిచేస్తున్న లక్ష్మిని చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.