తెలంగాణ ముఖ్యాంశాలు

నల్లగొండ అభివృద్ధి కి రూ.233.82 కోట్లు విడుదల చేసిన కేసీఆర్ సర్కార్

నల్లగొండ అభివృద్ధి కి ఏకంగా రూ.233.82 కోట్లను విడుదల చేసింది కేసీఆర్ సర్కార్. ఈ మేరకు ప్రభుత్వం జీవో 44 జారీచేసింది. ఈ నిధులతో నల్లగొండ ఐటీ పార్కు నుంచి ఉదయ సముద్రానికి అప్రోచ్‌ రోడ్డు నిర్మించనున్నారు. అలాగే పానగల్లు, పచ్చల సోమేశ్వర దేవాలయాలకు మహర్దశ రానుంది. నీలగిరి పట్టణంలో కళాభారతి నిర్మాణానికి ప్రభుత్వం రూ.90.61 కోట్లు కేటాయించింది. జిల్లా కేంద్రంలో శాశ్వత హెలీపాడ్‌ నిర్మాణానికి కూడా నిధులు విడుదల చేసింది. దీంతో నల్లగొండ సుందరీకరణకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చినట్లయింది.

ఈ నిధుల విడుదలపై ప్రతిపక్షాలు పలు రకాల కామెంట్స్ వేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఉండడం తో కేసీఆర్ సర్కార్ ఈ నిధులను విడుదల చేసిందని..మొన్నటి వరకు పట్టించుకోని ముఖ్యమంత్రి..సడెన్ గా నల్లగొండ మీద ప్రేమ కురవడానికి కారణం మునుగోడు ఉప ఎన్నికే అని కామెంట్స్ చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా చేయడం తో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో రెండు , మూడు నెలల్లో ఉప ఎన్నిక జరగబోతుందని సమాచారం. ఈ తరుణంలో ఈ నెల 20 న మునుగోడు లో టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇదే సభలో టిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/