ఏపీలో రాజకీయ వేడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ..ఇప్పటి నుండే నేతలు తమకు అనుకూల పార్టీలోకి వెళ్లడం స్టార్ట్ చేస్తున్నారు. తాజాగా వైస్సార్సీపీ సీనియర్ నేత ఒకరు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత 35 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నా తనకు ఎమ్మెల్యేగా అవకాశం రాకపోవడంతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చి..ఆయన జనసేన కండువా కప్పుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపరకు చెందిన వైస్సార్సీపీ సీనియర్ నేత వుయ్యురు శివ రామిరెడ్డి..పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయనకు పవన్ కల్యాణ్ తమ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరడం తనకు సంతోషంగా ఉన్నదని ఈ సందర్భంగా శివరామిరెడ్డి మీడియాతో అన్నారు.
వుయ్యూరు శివరామిరెడ్డి 1987 లో టీడీపీలో చేరి.. మూడేండ్ల పాటు మండల అధ్యక్షుడిగా ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించడంతో ఆయన వంచన చేరి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడయ్యారు. 2012 లో వైస్సార్సీపీలో చేరారు. జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగు చెంది పవన్ కల్యాణ్ వెంట నడిచేందుకు నిర్ణయించుకున్నట్లు శివరామిరెడ్డి అన్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/