బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నేడు జనగాం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దేవరుప్పుల గ్రామంలో ఏర్పటు చేసిన సభలో సంజయ్ మాట్లాడుతూ… కేసీఆర్ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు.
దీంతో అక్కడున్న కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. దీంతో, రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. టిఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అంతేకాదు టిఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయపై రాళ్లతో దాడికి యత్నించడంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారిన్ని చెదరగొట్టారు. ఈ ఘటనలో స్తానికుల్లో ఆందోళన
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/