జాతీయం ముఖ్యాంశాలు

జమ్ముకశ్మీర్​ లో ఘోర ప్రమాదం…ఆరుగురు జవాన్ల మృతి

జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణీస్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీబీపీ జవాన్లు మృతిచెందగా.. మరో 32 మంది జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. పహల్గామ్​లోని ఫ్రిస్లాన్ చందన్వారి రోడ్డు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు ఫెయిలవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు.

మంగళవారం ఉదయం 39 మంది ఐటీబీపీ జవాన్లతో ప్రయాణిస్తున్న బస్సు.. బ్రేక్​లు ఫైయిల్​ అవ్వడం వల్ల పక్కన ఉన్న నదిలో పడిపోయింది. ఘటనాస్థలికి అధికారులు చేరుకున్నారు. అపార ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే బస్సులోని జవాన్లంతా అమర్​నాథ్​ యాత్రకు సంబంధించిన విధులు నిర్వర్తించి తిరిగి వస్తున్నారు” అని ఐటీబీపీ ఉన్నతాధికారులు తెలిపారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/