ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

సీఎం జగన్‌ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు: ఏపీ గవర్నర్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ మేరకు ట్విటర్‌ పేజీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. శనివారం ఉదయం ఓ ట్వీట్‌ చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌- వైఎస్‌ భారతి రెడ్డిలకు 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ దంపతులకు జగన్నాధుడి, బాలాజీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితం గడపాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్‌ ద్వారా తెలియజేశారు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్