అంతర్జాతీయం క్రీడలు జాతీయం ముఖ్యాంశాలు

WTC ఫైనల్‌: భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై సందేహాలు

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌కు అడుగడుగునా వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. ఈ మ్యాచ్‌ ఆరంభమైంది మొదలు ఇప్పటివరకూ ఇక్కడ ఏదొక సమయంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశాలు కనబడుటం లేదు. నాలుగో రోజు ఆట‌కు సైతం వ‌ర్షం అడ్డంకిగా మారింది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉండగా వర్షం అంతరాయం కల్గించింది. అక్కడ ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇక వర్షానికి తోడు సరిపడనంత వెలుతురు లేకపోవడం ఆట కొనసాగింపుకు సమస్యగా మారుతోంది.

నాలుగో రోజు మ్యాచ్‌ నిర్వహించాలా వద్దా అన్నదానిపై అంపైర్ల సమీక్షిస్తున్నారు. ఈరోజు మొత్తం ఆడపా దడపా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో ఆట రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్‌ (12 బ్యాటింగ్‌), రాస్‌ టేలర్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.