వారి 36 గంటల పర్యటనకు అయిన ఖర్చు సుమారు రూ.38 లక్షలేనన్న కేంద్ర ప్రభుత్వం
2020 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంక, ఆమె భర్త జేరడ్ కుష్నర్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కేవలం 38 లక్షలు ఖర్చు చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. డోనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జేర్డ్న్ కుష్నర్‌తో పాటు పలువురు అమెరికా అధికారులు ఇండియాలో టూర్ చేశారు. అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీలో ఆ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 24వ తేదీన అహ్మదాబాద్‌లో ట్రంప్ మూడు గంటలు గడిపారు. 22 కిలోమీటర్ల రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన గాంధీకి నివాళి అర్పించారు. మోతెరే స్టేడియంలో జరిగిన నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్‌లోనూ పాల్గొన్నారు. ఆ రోజునే డోనాల్డ్ ట్రంప్.. ఆగ్రాలోని తాజ్ మహల్‌ను విజిట్ చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
డోనాల్డ్ ట్రంప్ టూర్ సమయంలో ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని ఓ వ్యక్తి ఆర్టీఐ ఫిర్యాదులో కోరారు. అయితే ఫుడ్, సెక్యూర్టీ, హౌజింగ్, ఫ్లయిట్స్, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులన్నీ చెప్పారు. మిషాల్ బత్తిన అనే వ్యక్తి ఆర్టీఐలో దరఖాస్తు చేశారు. 2020, అక్టోబర్ 24న అతను ఆ దరఖాస్తు దాఖలు చేశారు. కానీ ఆర్టీఐ నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో అతను కమిషన్‌ను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ .. డోనాల్డ్ ట్రంప్ టూర్ ఖర్చులకు సంబంధించిన రిపోర్ట్‌ను ఆగస్టు 4వ తేదీన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌కు సమర్పించింది. ట్రంప్ రాక సందర్భంగా సుమారు 38 లక్షలు ఖర్చు చేసినట్లు ఆ రిపోర్ట్‌లో తెలిపారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/