ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్‌కీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు రష్యా దాడులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని జెలెన్స్‌కి అన్నారు. సోవియట్ పాలన నుంచి స్వతంత్రం వచ్చి 31 ఏళ్లయిన సందర్భంగా ఈనెల 24న జరగనున్న ఈ వేడుకలపై రష్యా మరింత క్రూరమైన, దారుణమైన దాడులు చేయొచ్చని జెలెన్స్‌కీ చెప్పారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లో బుధవారం నాడు పూర్తిగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపారు. తమ దేశంలో రష్యా మరింత విధ్వంసాన్ని, భయాన్ని పెంపొందించకుండా ఉక్రేనియన్లు అడ్డుకోవాలని సూచించారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/