పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద చట్టం కింద కేసు బుక్ చేశారు.ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం సోమవారం ఇస్లామాబాద్ హైకోర్టును ఇమ్రాన్ ఆశ్రయించారు. ఇటీవల జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో.. మహిళా జడ్జితో పాటు కొందరు సీనియర్ పోలీసు అధికారులకు ఇమ్రాన్ ఖాన్ బెదిరింపులు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం యాంటీ టెర్రరిజం యాక్ట్‌లోని సెక్షన్ 7 కింద ఇమ్రాన్‌పై కేసు నమోదు చేశారు. ఇమ్రాన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున లాయర్లు బాబర్ అవాన్, ఫైసల్ చౌదరీలు ఇవాళ కోర్టును కోరారు. అధికారంలో ఉన్న పీడీఎం ఇమ్రాన్‌ను కావాలనే టార్గెట్ చేసినట్లు పిటిషన్‌లో లాయర్లు ఆరోపించారు. ఇమ్రాన్‌ను అరెస్టు చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకున్నారు. ఏప్రిల్‌లో ఇమ్రాన్ తన పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. దేశ ద్రోహం చట్టం కింద తన సన్నిహితుడిని హింసిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/