బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు తృటిలో చేదు అనుభవం తప్పింది. రీసెంట్ గా బీహార్‌లో మహాఘట్ బంధన్ కూటమితో కొత్త ప్రభుత్వం ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్..ఈరోజు సోమవారం గయా పట్టణంలో పర్యటించాలని అనుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా నితీష్ కుమార్.. గయాకు హెలీకాప్టర్‌లో వెళ్లగా.. లోకల్‌గా తిరిగేందుకు ఆయన కాన్వాయ్ అక్కడికి బయలుదేరింది.
ఇదే సమయంలో పట్నా-గయా హైవేపై కొంతమంది వ్యక్తులు నిరసనలు తెలుపుతున్నారు. గౌరీచక్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కొద్దిరోజులుగా తప్పిపోవడం ఆ తర్వాత శవమై కనిపించడంతో వీరంతా పోలీసుల వైఖరిని నిరససిస్తూ ఆందోళనలనకు దిగారు. ఇదే సమయంలో సీఎం కాన్వాయ్ అటుగా రావడంతో నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువకులు కార్లపై రాళ్లు విసిరారు. దీంతో కాన్వాయ్‌లోని నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా, వారి దాడి సందర్భంగా సీఎం కారులో లేకపోవడం, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/