శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో స్పెషల్ పీఎంఎల్‌ఏ కోర్టు జ్యుడీషియల్ కస్టడీని వచ్చే నెల 5 వరకు పొడిగించింది. ఈ కేసులో జూలై 31న ఈడీ ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిది గంటల విచారణ తర్వాత ఆయనను ఈడీ అదుపులోకి తీసుకొని, అర్ధరాత్రి అరెస్టు చేసింది. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆగస్టు 4 వరకు వరకు ఈడీ కస్టడీకి పంపింది. అనంతరం మళ్లీ 8 వరకు కస్టడీని పొడిగించింది. అనంతరం ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం మరోసారి కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/