ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

చంద్రబాబును సిఎం చేయడమే పవన్ ముందున్న లక్ష్యంః వెల్లంపల్లి

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్ట్ పవనేనంటూ ఆరోపించారు. చిరంజీవికి అధికారం రాలేదని ఆయన్ని పక్కన పెట్టింది పవనేనని వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. 18 సీట్లే వచ్చాయని పార్టీలో కనబడని పవన్.. ప్రజారాజ్యం‌ను విలీనం చేయవద్దని చిరంజీవికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ విలీనానికి పవన్ కళ్యాణే కారణమని.. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు జనసేన కోసం చిరంజీవి అవసరం వచ్చిందని పేర్కొన్నారు.

చిరంజీవి లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడంటూ జనసేనానిపై వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ ముందున్న లక్ష్యమంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌గా కూడా గెలవలేరు. అందుకే బిజెపి ఆయన వల్ల ఉపయోగం లేదని జూనియర్ ఎన్టీఆర్‌ను దగ్గరకు తీసుకుంటోంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని బిజెపి నేతలకు అర్ధమైందని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/