ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీరు భయపెడితే భయపడటానికి కాంగ్రెస్ నాయకులం కాదు.. మేం సర్దార్ వల్లభాయ్ పటేళ్లం.. భగత్ సింగ్‌లం.. భయపడం.. పోరాడుతామని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. ఓడిపోతామని తెలిస్తే చాలు బిజెపి కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆప్ నాయకుడు మనోజ్ సోరథియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
మనోజ్‌పై బిజెపి గుండాలు దాడి చేయడంతో.. గుజరాత్‌లోని ఆరు కోట్ల మంది ప్రజలు మోడీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఓ నాయకుడిపై దాడి చేయడం ఈ దేశం సంస్కృతి కాదు. అంతకంటే హిందూ సంస్కృతి కాదు. అసలు గుజరాత్ కల్చర్ కానే కాదన్నారు. మనోజ్‌పై దాడి చేయడాన్ని సూరత్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు. సూరత్‌లో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 7 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. గుజరాత్‌లో ఆప్ విజయం సాధించడం ఖాయమని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/