బ్రిటన్ తదుపరి ప్రధాని పదవికోసం నిర్వహించిన ఎన్నికల ఫలితాలు ఈరోజు సాయంత్రం 5 గంటలకు వెలువడనున్నాయి. బ్రిటీష్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఈ పోటీలో లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. వీరిద్దరిలో విజేతను తేల్చడానికి జరిగిన ఎన్నికలు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిశాయి. ఫలితాలను నేడు ప్రకటించనున్నారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన లక్షా 60 వేల మంది క్రియాశీల సభ్యులు.. ఆగస్టు నెల నుంచి పోస్ట్ ద్వారా, ఆన్‌లైన్‌లోనూ ఈ నెల 2వ తేదీ వరకు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాగా, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/