అంతర్జాతీయం ముఖ్యాంశాలు

చైనాలో భారీ భూకంపం

చైనాలో భారీ భూకంపం సంభవించింది. లూడింగ్​కు సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఈ భూకంపం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఎపిక్​ సెంటర్​కు సుమారు 226 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిచువాన్​ రాజధాని చెంగ్డులోనూ భూమి కనిపించింది. సుమారు 6.8 మాగ్నిట్యూడ్​ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. టిబెట్​ను ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో తరచూ ఇలాంటి భూకంపాలు సంభవిస్తాయని అక్కడి ప్రజలు తెలిపారు.

అయితే భూకంపం కారణంగా నష్టం జరిగినట్లు ఇప్పటికీ ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. టిబెట్‌ను ఆనుకొని ఉన్న సిచువాన్‌ ప్రావిన్స్‌లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. టిబెటన్ పీఠభూమిలోనూ తరచూ భూకంపాలు నమోదవుతూ ఉంటాయి. 2008లో సిచువాన్‌లో 7.9 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపానికి దాదాపు 90వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చెంగ్దు ప్రావిన్షియల్‌ని పట్టణంలో భూకంపం వినాశనం సృష్టించింది.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/