ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

టిడిపి అధినేత చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాంటూ వైఎస్‌ఆర్‌సిపి నేత లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే ఈ పిటిషన్‌ను కొట్టివేసిందని తెలిపింది. ఎవరి ఆస్తులు.. ఎవరికి తెలియాలని కోర్టు ప్రశ్నించింది. లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశానికి విలువ లేదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/