జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్తగా 6,422 కరోనా కేసులు

46,389కి తగ్గిన యాక్టివ్ కరోనా కేసులు

దేశంలో కరోనా రోజు వారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 6,422 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనికి ముందు రోజు 5,108 కేసులు నమోదు కావడం గమనార్హం. మరోవైపు ఇదే సమయంలో 5,748 మంది కరోనా నుంచి కోలుకోగా… 14 మంది మహమ్మారికి బలయ్యారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,45,16,479కి చేరుకుంది. వీరిలో 4,39,41,840 మంది కోలుకోగా… 5,28,250 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు సంఖ్య 46,389కి తగ్గింది.

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.04 శాతంగా, క్రియాశీల రేటు 0.10 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,15,98,16,124 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 31,09,550 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/