కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు రేపు (శుక్రవారం) విరామం ఇచ్చారు. ప్రస్తుతం కేరళలో రాహుల్ యాత్ర కొనసాగుతుంది. కాగా నేటి రాత్రి ఆయన ఢిల్లీ బయలుదేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రేసులో ముందు వరుసలో ఉన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ గురువారం యాత్రలో ఉన్న రాహుల్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా రాహుల్, గెహ్లాట్ ల మధ్య పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన చర్చలు జరిగాయి. పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఇతర నేతలు, ఎన్నికలపై పార్టీ అధిష్ఠానం పెద్దలతో చర్చలు జరిపే నిమిత్తమే రాహుల్ గాంధీ నేటి రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో ఈ చర్చలన్నింటినీ ముగించుకుని ఎల్లుండి (శనివారం) ఉదయానికి రాహుల్ తిరిగి కేరళ చేరుకుంటారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/