తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుండి బతుకమ్మ చీరల పంపిణి మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల చీరల నాణ్యత బాగాలేదని కొంతమంది ఆడవారు చీరలను తగలపెట్టారు. ఆలా చేస్తే శిక్ష తప్పదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రేషన్ షాపులు, రెవెన్యూ కార్యాలయాలు, కమ్యూనిటీహాళ్లు వేదికగా పంపిణీ కేంద్రాల నుంచి ఆడబడుచులకు చీరలను పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ చీరలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండి పడ్డారు. అంతేకాదు చీరలు నచ్చలేదంటూ వాటిని కాలిస్తే ఊరుకోమని.. సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో.. రాజకీయ స్వార్థంతో ఎవరైనా చీరలను మంటల్లో వేసి కాలిస్తే.. తప్పని సరిగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఇచ్చే బతుకమ్మ కానుక చీరను వెలకట్ట వద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఆయన దసరా పండగక్కి ఆడబడుచులకు ఇచ్చే కానుకగా చూడాలంటూ కోరారు. అంతేకాని.. చీరలు నచ్చలేదంటూ ఎక్కడైనా కాలిస్తే.. కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఎర్రబెల్లి.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/