ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగి పోయేలా బదులిచ్చింది . యూఎన్‌లోని ఇండియన్ మిషన్ కార్యదర్శి మిజిటో వినిటో మాట్లాడుతూ.. కశ్మీర్‌పై పాక్ ప్రధాని షెహబాజ్ తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలిపారు. పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్నట్లు మిజిటో ఆరోపించారు. భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు యూఎన్‌ను పాక్ ప్రధాని వేదికగా చేసుకోవడం సరైన విధానం కాదన్నారు. స్వదేశంలో ఉన్న సమస్యల నుంచి తప్పుదోవ పట్టించేందుకు ఆయన ఇలా చేశారని వినిటో ఆరోపించారు. దావూద్ ఇబ్రహీం గురించి ప్రస్తావించిన భారత్.. శాంతి కావాలని ఆశిస్తున్న దేశం.. ఎన్నటికీ 1993 బాంబు పేలుళ్ల నిందితులకు ఆశ్రయాన్ని ఇవ్వదని అన్నారు. పాక్‌తో భారత్ స్నేహపూర్వక సంబంధాల్ని కోరుతున్నట్లు వినిటో తెలిపారు. ఉగ్రవాదం, ద్వేషం, హింస వద్దన్నారు. స్వదేశంలో మైనార్టీలను పట్టించుకోని పాకిస్థాన్.. ప్రపంచ స్థాయిలో మైనార్టీల రక్షణ గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/