అమెరికా హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఘటన
తాలిబన్‌ల ఆధీనంలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్ వరుసగా బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్నది. గత గురువారం కాబూల్ విమానాశ్రయం పరిసరాల్లో జంట పేలుళ్లు మిగిల్చిన విషాదం నుంచి తేరుకోకముందే.. తాజాగా మరో పేలుడు సంభవించింది. తాజా పేలుడు కూడా కాబూల్ విమనాశ్రయం లక్ష్యంగానే జరిగినట్లు ఆఫ్ఘనిస్థాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, పేలుడులో ఎవరైనా మరణించరా.. గాయాలపాలయ్యారా.. అనే వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, కాబూల్‌లో 24 గంటల నుంచి 36 గంటల వ్యవధిలో ఉగ్రవాదులు మళ్లీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఉదయం హెచ్చరించాడు. అమెరికా హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఇప్పుడు పేలుడు సంభవించడం గమనార్హం. కాబూల్ ఎయిర్‌పోర్టులో స్వేదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అమెరికన్‌లే లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుడుకు పాల్పడిటనట్లు అనుమానిస్తున్నారు.