తెలంగాణ ముఖ్యాంశాలు

వాసాలమర్రి గ్రామస్తులతో కేసీఆర్ సహపంక్తి భోజనం

సీఎం కెసిఆర్ వాసాల‌మ‌ర్రి గ్రామ‌స్తుల‌తో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం చేశారు. ఇక భోజ‌నం చేస్తున్న మ‌హిళ‌ల వ‌ద్ద‌కు వెళ్లి సీఎం కేసీఆర్ వారి యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. భోజ‌నాలు ఎలా ఉన్నాయ‌ని అడిగారు. కేసీఆర్ ఒక సామాన్యుడిలా వారి వ‌ద్ద‌కు వెళ్లి ఆప్యాయంగా ప‌లుక‌రించ‌డంతో మ‌హిళ‌లు సంతోషం వ్య‌క్తం చేశారు. గ్రామంలోని 3 వేల మందికి ఒకేసారి భోజ‌న ఏర్పాట్లు చేశారు. వాసాల‌మ‌ర్రిలోని కోదండ రామాల‌యంలో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. భోజనాల అనంతరం వాసలమర్రి గ్రామస్తులతో గ్రామసభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.