అంతర్జాతీయం ముఖ్యాంశాలు

British Airline: ఇదేం విచిత్రం.. బరువు ఎక్కువైందని ప్రయాణికులను దించేసి వెళ్లిన విమానం

British Airline: ఇటీవలి కాలంలో విమానాల్లో తరచూ జరుగుతున్న ఘటనలు అందులో ప్రయాణించాలంటేనే ప్రయాణికులకు వణుకు వచ్చేలా చేస్తున్నాయి. తాజాగా ఓ విమానం ఎక్కేందుకు వచ్చిన ప్రయాణికులకు సరికొత్త అనుభవం ఎదురైంది. విమానం బరువు ఎక్కువైందని.. సరైన వాతావరణ పరిస్థితులు లేక పోవడంతో కొంత మంది ప్రయాణికులను దించేసి ఆ విమానం గాల్లోకి ఎగిరింది. దీంతో ఆ ప్రయాణికులు అవాక్కయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా ?

British Airline: వారంతా విమానం టికెట్లు బుక్ చేసుకున్నారు. సమయానికి ఎయిర్‌పోర్టుకు కూడా చేరుకున్నారు. అక్కడి నుంచి రన్‌వేపై ఉన్న విమానం దగ్గరకు చేరుకున్నారు. ఇక బయల్దేరడమే తరువాయి అనుకున్న సమయంలో వారికి ఊహించని షాక్ తగిలింది. వారిని ఎక్కించుకోకుండానే ఆ విమానం వెళ్లిపోయింది. ఎందుకంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఆపై అధిక బరువే కారణమని తెలుస్తోంది. దీంతో ఆ ప్రయాణికులు అందరూ షాక్‌లో ఉండిపోయారు. ఈ ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది.