ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

సన్నీ లియోన్  రోజా మధ్య వార్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తూ..  మంత్రి రోజా సన్నీలియోన్ ప్రస్తావన తీసుకు వచ్చింది. పవన్ మాటలు వింటూంటే.. సన్నీలియోన్ వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యాఖ్యానించింది.  ఈ అంశం చర్చనీయాంశమయింది. స్వయంగా సినీ నటి అయిన రోజా.. మరో సినీ నటి అయిన సన్నీలియోన్ ను తప్పుగా అన్వయిస్తూ.. పవన్ కల్యాణ్ ను నిందించడం ఏమిటన్న  చర్చ జరిగింది. ఈ అంశంపై సన్నిలోయిన్ కూడా స్పందించారని.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సన్నిలియోన్ పేరు మీద ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.   కానీ ఆ ట్వీట్ ను కాస్త నిశితంగా పరిశలిస్తే.. వెరీఫైడ్ ఖాతా కాదని అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల డబ్బులు కట్టిన వారందరికీ వెరీఫైడ్ ఇస్తున్నారు. లేకపోతే లేదు. అయితే నిజంగానే ఆ ట్విట్టర్ ఖాతా సన్నిలియోన్ ది కాదు. ఆమె అధికారిక అకౌంట్ కి బ్లూటిక్ ఉంది. అందులో .. రోజా వ్యాఖ్యలపై ఎలాంటి రియాక్షన్ లేదు.   సన్నీలియోన్ చాలా ప్రొఫెషనల్ అని.. ఇలాంటి రాజకీయ విమర్శలను ఆమె అసలు పట్టించుకోరని.. ఇలాంటివి ఆమె దృష్టికి కూడా లేదని సినీ వర్గాలు చెబుతున్నాయిజఅయితే పవన్ కల్యాణ్ ను విమర్శించినందు వల్ల జనసైనికులు పెద్ద ఎత్తున సన్నిలియోన్ పేరుతో కౌంటర్లు ఇస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. మరో వైపు రోజా తీరుపై జనసైనికులు పెద్ద ఎత్తున ట్వీట్లు పెడుతున్నారు. రోజా నటించిన పాత సినిమాల్లో పాటలను ప్రస్తావిస్తున్నారు. సినిమా రంగంలో చేసి.. పవన్ కల్యాణ్‌ను ఎలా ఎలా విమర్శిస్తారని అంటున్నారు. మొత్తానికి రోజా చేసిన వ్యాఖ్యలు  మాత్రం జనసైనికులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి.