కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కిచెన్ బడ్జెట్ డబుల్ కావటంతో వినియోగదారులు చుక్కులు చూస్తున్నారు. ఇక టమాట ధరలతో పోల్చితే చికెన్ బెటర్ అన్నట్లు ఉంది తాజా పరిస్థితి. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు! అన్నట్లు ఉంది వినియోగదారుల పరిస్థితి. గత కొద్దిరోజులుగా కూరగాయలు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రజలు… కూరగాయలు అంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక టమాటా ధరల గురించి చెప్పే పరిస్థితే లేదు. కొండెక్కి కూర్చున్న ధరలతో…. సామాన్యులు కొనే కనిపించటం లేదు. కేజీ టమాటా ధరతో పోల్చితే….కేజీ చికెన్ వస్తుందంటే సీన్ ఎలా ఉందో సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు.అన్ని రాష్ట్రాల్లో దాదాపు కేజీ టమాట ధర 150కు పైగా పలుకుతుంది. పలుచోట్ల అయితే 200 దాటిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో టమాటాతో కూర అంటేనే భయపడిపోతున్నారు.
చేతినిండా డబ్బులతో మార్కెట్ కు వెళ్తున్న వినియోగదారులు…వట్టి చేతులతో వెనక్కి వచ్చేస్తున్నారు. ఉన్నంతలోనే కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే… కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 దాకా పలుకుతుండడంతో టమాట కొనాలంటేనే సామాన్యులు బెంబేళెత్తిపోతున్నారు. దాదాపు నెల క్రితం రాష్ట్రంలో కిలో టమాట ధర రూ. 50లోపే ఉంగా ఇప్పుడు రూ.150 నుంచి రూ.200 మధ్యన అమ్ముడవుతోంది.
జిల్లా కేంద్రాల్లో కంటే గ్రామాల్లోనే టమాట ధరలు అధికంగా ఉండడంతో పేద, సామాన్యులు టమాట కొనాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. టమాట ధరలే కాదు… పచ్చి మిర్చి కూడా తెగ ఘాటెక్కిపోయింది. కేజీ పచ్చి మిర్చి రూ. 140 నుంచి రూ. 160 మధ్య నడుస్తోంది. ఫలితంగా ప్రతి కూరలో కీలకమైన టమాటా, పచ్చి మిర్చి ధరలు పెరగటంతో సామాన్యులు పట్టపగలే చుక్కులు చూస్తున్నారు. టమాట ధరలు వారం, పది రోజుల్లో తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా… ఆ దిశగా పరిస్థితులు కనిపించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.దేశంలోని పలు చోట్ల ఎడతెరపిలేని వర్షాలు, అల్ప వర్షాల కారణంగా రానున్న రోజుల్లో టమాటా ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత మూడు వారాల నుంచి అటు రిటైల్ మార్కెట్‌లోనూ ఇటు హోల్‌సేల్ మార్కెట్లోనూ టమాటాలను అధిక ధరలకే విక్రయించారు. జూన్‌తో పోలిస్తే జులైలో టమాటా ధరలు ఏకంగా 326.13శాతానికి పైగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.మొన్నటి వరకు చికెన్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. కేజీ ధర రూ. 350 దాటిన పరిస్థితి కనిపించింది. వర్షాలు మొదలైన తర్వాత… క్రమంగా చికెన్ ధరలు తగ్గుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు చూస్తే… ప్రస్తుతం మార్కెట్‌లో కిలో లైవ్ బర్డ్ రూ.110, కేజీ స్కిన్‌తో అయితే రూ.180- 200గా ఉంటే… స్కిన్‌లెస్ రూ.210- 220 మధ్య విక్రయిస్తున్నారు. ఇక మరికొద్దిరోజుల్లో శ్రావణ మాసం రాబోతుంది.
మెున్నటి వరకు పెళ్లిళ్ల సీజన్, ఎండాకాలంలో కోళ్లు చనిపోవటంతో ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే.శ్రావణం షురూ అయితే… చాలా మంది మాంసాహారం ముట్టకపోటంతో చికెన్‌కు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. దీంతో ధరలు అమాతం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కూరగాయులు ధరలు ఆకాశన్నంటిన తరుణంలో చికెన్ ధరలు తగ్గటం ఊరటనిచ్చే అంశమే. ప్రస్తుతం కిలో టమాటా రూ. 100 నుంచి 150 పైగా పలుకుతుండగా.. కేజీ టమాటకు బదులుగా అర కేజీ చికెన్ తెచ్చుకొని తినటం బెటర్ అని చాలా మంది భావిస్తున్నారు.కుండా రాజకీయ పరంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి మండిపడ్డారు.