దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనానికి.. సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ప్రతిరోజు అర్చక స్వాములు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆ సమయంలో స్వామివారికి మొక్కులరూపంలో బంగారం, వెండి వెండితోపాటు డబ్బులను హుండీ స్వామివారికి సమర్పిస్తారు.
గత కొన్ని నెలలుగా హుండీ ఆదాయం లెక్కించిన సమయంలో బ్యాంకర్లు నోట్లను తీసుకోగా చిల్లరను తీసుకోకపోవడంతో కుప్పలు, తేప్పలుగా నాణేలు పేరుకుపోయాయి. దీంతో గత కొన్ని నెలలుగా ఆలయ అధికారులు లాకర్ లో నాణేలతో కూడిన సంచులను భద్రపరిచారు.గత కొన్ని నెలలుగా చిల్లర నాణేలు ఏ బ్యాంక్ అధికారులు తీసుకోకపోవడంతో ఆలయ ఉన్నతాధికారులకు సమస్యగా మారింది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆలయ అధికారులు నాణేలను తీసుకోవాలని బ్యాంకు అధికారులతో మాట్లాడడంతో వారు తీసుకునేందుకు అంగీకరించారని.. ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. దీంతో రాజన్న చిల్లర నాణేలను ఆలయ ఓపెన్ స్లాబ్ లో రెండు రోజులపాటు శ్రీ రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు, ఆలయ అధికారులు సిబ్బంది లెక్కించగా మొదటి రోజు 41లక్షల 40వేల రూపాయలు రాగా.. రెండవ రోజు 40లక్షల 12వేల 500 రూపాయలు వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ మొత్తాన్ని యూనియన్ బ్యాంక్ కు అందించడంతో చిల్లర నాణేల సమస్య తీరిపోయింది.
యూనియన్ బ్యాంక్ అధికారులు 4 తూకం కేంద్రాలను ఏర్పాటు చేసి.. నాణేలను తూకం వేసి పాలిథిన్ కవర్లలో నింపుపారు. ఒక్కో సంచిలో రూ.2వేల 200 నింపి సీజ్ చేస్తున్నారు. రెండు రోజుల్లో మొత్తం 82లక్షల 12వేల 500 రూపాయలు బ్యాంక్ అధికారులకు అప్పగించారు. స్వామివారి హుండీ లెక్కింపులో పాల్గొన్న సేవాసమితి సభ్యులకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి తీర్థప్రసాదాలను ఆలయ ఉన్నతాధికారులు అందజేశారు. సీసీ కెమెరాలు పోలీస్ ప్రతిష్ట భద్రత నడుము ఉండి లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లు ఈవో తెలిపారు. ఈ ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించినట్లు వెల్లడించారు.