rotary
తెలంగాణ ముఖ్యాంశాలు

రోటరీ క్లబ్ ద్వారా ఉచితంగా  విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ

విద్యా సంవత్సర ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినీ విద్యార్థులకు పుస్తకాల వితరణ చేస్తున్నట్టు  నంద్యాల జిల్లా రోటరీ క్లబ్ అధ్యక్షులు కరుణామయ విద్యాసంస్థల చైర్మన్ దండే దస్తగిరి అన్నారు.


సోమవారం నాడు  నంద్యాల లోని ఎన్విఎస్  రోటరీ భవన్ లో రోటరీ క్లబ్  అధ్యక్షుడు  దండే దస్తగిరి   అధ్వర్యంలో ఉచితంగా ఉర్దూ పాఠశాల, గవర్నమెంట్ పాఠశాల, మరియు చిన్మయ మిషన్ స్కూల్  విద్యార్థులకు  ₹10 వేల విలువ గల నోట్ పుస్తకాలనురోటరీ క్లబ్ పిడిసి కందుకూరి శ్రీరామ మూర్తి దంపతుల సహకారముతో అందించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు  దండే దస్తగిరి  మాట్లాడుతూ  ఆర్థికంగా వెనుకబడిన వారికి రోటరీ క్లబ్ ఎప్పుడూ దోహదం చేస్తుందనీ విద్యార్థులు సమాజలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి విద్యా ఎంతగానో దహదపడుతుంది, వచ్చిన అవకాశాలను సద్వినయోగం చేసుకోవాలని తెలిపారు.

దాత రోటరీ క్లబ్ పిడిజి శ్రీరామమూర్తి మాట్లాడుతూ నోట్ పుస్తకాల పంపిణీ విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు దోహదపడుతుంది అని, పేద విద్యార్థుల అభివృద్ధి కి తన వంతు సహకారం ఎల్లప్పుడూ వుంటుందని తెలిపారు. కార్యక్రమములో కె. రామలింగ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఈ విద్యార్థి దశలో కష్టపడి పనిచేయడం, పట్టుదల, నేర్చుకొని మంచి ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమములో  రోటరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, విశ్వనాథ్, సభ్యులు గుప్తా, సుబ్బరామయ్య, డాక్టర్ కళామురళి, నాగ రాజారావు, రాగి రమేష్ , ఎం రాజశేఖర్,  సాయి సత్యనారాయణ, నెరవాటి సత్యనారాయణ, కైలాష్ నాథ్ రెడ్డి,  విజయసేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, అశోక్ రెడ్డి, ఎల్ఐసి వెంకటేశ్వర్లు, మామిడి మధుసూదన్, జిఎంవి  సుబ్బారెడ్డి, ఆదినారాయణ ,   సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.