anju
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

అంజూయాదవ్‌పై చర్యలు తీసుకోండి..శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి పవన్‌ ఫిర్యాదు..

 జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సోమవారం  తిరుపతి చేరుకున్నారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు..

తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అక్కడ వినతిపత్రం అందజేశారు..

ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై సీఐ అంజూయాదవ్‌ చేయిచేసుకున్నారు. దీన్ని జనసైనికులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే పవన్‌ తిరుపతి చేరుకుని జిల్లా ఎస్పీని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు..