ఒంగోలులో యువకుడిపై దాడి ఘటన దారుణమని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. బాధితుడిని కలిసేందుకు ఒంగోలు ఎస్పీ కార్యాలయం ని కి వచ్చిన ఆయన మీడియా తో మాట్లాడారు. బాధితుడు
ఎస్పీ కార్యాలయంలో ఉన్నారంటేనే వచ్చామని, బాధితుడిని దాయాల్సిన అవసరం పోలీసులకేముందని ప్రశ్నించారు. ఎందుకు దాచారో పోలీసులే చెప్పాలని డిమాండ్ చేశారు. అతను నేరస్తుడే కావచ్చు..
కానీ శిక్ష వేసే అర్హత పోలీసులకు లేదన్నారు. ఆ యువకుడు నోట్లో మూత్రం పోశారంటే మనం ఎక్కడ ఉన్నామో… ఆలోచన చేయాలన్నారు. ఈ ప్రభుత్వంలో వరుసగా దళితులపై దాడులు
జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.. దళితులపై దాడి ఘటనలపై ఏపీ సీఎం చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ లాంటి చర్యలతో దళిత జాతి మొత్తానికి అభద్రతాభావం కలుగుతుందని హెచ్చరించారు.