ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లపై టీడీపీ ప్రతి పక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని సంత నూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు… మల్లవరం లోని గుండ్లకమ్మ ప్రాజెక్టు
గేట్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు రైతులతో కలిసి గేట్లను పరిశీలించారు.. అక్కడ ఇంజనీరింగ్ అధికారులతో గేట్ల మరమ్మత్తుల అంశాలను అడిగి తెలుసుకున్నారు..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గేట్ల మరమ్మతులకు తక్షణ సాయం కింద 9 కోట్ల 40 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారని..ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.. వచ్చే ఖరీఫ్ కు రఫీ పంటలకు సాగునీరుకు, తాగునీరుకు డోకా ఉండదని భరోసా ఇచ్చారు.. ప్రతిపక్ష టిడిపి ఇతర పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని రైతులను కోరారు.. నాడు నేడు అన్న విధంగా తెలుగుదేశం హయాంలో ప్రాజెక్టు పనితీరు నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాజెక్టు పనితీరుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.. రైతులను అసత్య ప్రచారాలతో మోసపుచ వద్దన్నారు.. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు..