ఏలూరు జిల్లా భీమాడోలు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యo వలన ఉదయం అర్జావారిగూడెంకు చెందిన నాలుగేళ్ల అంగులూరి చిన్నారి అనే బాలిక జ్వరంతో హాస్పిటకు తీసుకురాగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లబాలిక చనిపోయిందన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు.
భీమాడోలు ప్రభుత్వ హాస్పిటల్ ముందు బైటాయించిన బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసన తెలియజేయడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి వద్దకు భారీగా జనాలు రావటంతో ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. అయితే ఉదయం నుండి పిల్లలకు సరైన వైద్యం జరగలేదని, వైద్యం చేయవలసిన డాక్టర్ అందుబాటులో లేరని కనీసం నర్సులు కూడా లేక ఆస్పత్రి ఆయాలే తెలిసి తెలియని మందులు ఇచ్చారని ఈ పరిణామం వల్లే పిల్లని కోల్పోయామని పాప తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.