విశాఖలో కొత్తగా నైట్ అవుట్స్ పేరుతో గ్యాంగ్ ఏర్పాటైంది. కైలాస పురం ప్రాంతానికి చెందిన కొంతమంది యువ కులు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక రికొకరు పరిచయ మయ్యారు. వీరం తా చెడు అలవాట్లకు బానిసలై అడ్డ దారుల్లో అక్రమ సంపాదనపై ద్రుష్టి సారించి దోపిడీలకు తెర లేపారు. అందుకోసం నైట్ అవుట్స్ పేరుతో గ్రూపు ఏర్పాటు చేసుకుని అర్ధరాత్రి సమయంలో బైక్లపై నగ ర శివారు ప్రాంతాలకు వెళ్లి లారీలను అడ్డగించి డ్రైవర్ల ను బెదిరించి డబ్బులు దోచు కుంటున్నారు.
ఈ తరహా నేరాలపై ఫిర్యాదులు అందడంతో వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టి ఏడుగురు సభ్యుల ముఠా ను అరెస్టు చేసినట్లు క్రైమ్ డీసీపీ నాగన్న తెలిపా రు. కైలా సపురం ప్రాంతానికి చెందిన సురేష్, లక్ష్మణ్, నరేంద్రకుమార్తో పాటు మరో నలుగురు మైనర్లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు పరిచయ మయ్యారు.వీరి దోపిడీలపై బాధితులు ఎయిర్పోర్టు క్రైమ్ పోలీసులకు ఫిర్యా దు చేయడం తో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు