waterfall
తెలంగాణ ముఖ్యాంశాలు

ఆకట్టుకుంటున్న నానిజీపూర్ వాటర్ ఫాల్స్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో శంషాబాద్ మండలంలోని నానాజీపూర్ లో వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. భారీ వర్షాలకు ఎన్టేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో శంషాబాద్ మండలంలోని ననాజీపూర్ వద్ద అద్భుత జలపాతాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో గత రాత్రి నుండి ననాజీపూర్ లోని ఎన్టేరు వాగుకు వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైంది.

ఈ నేపథ్యంలో నమాజీపూర్ లోని అద్భుత వాటర్ ఫాల్స్ ను తిలకించేందుకు పర్యాటకులు ఈ గ్రామానికి క్యూ కడుతున్నారు. మరోవైపు ననాజీపూర్ వాటర్ ఫాల్స్ వద్ద గతంలో పలువురు యువకులు గల్లంతై ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. శంషాబాద్ పోలీసుల ఆదేశం మేరకు పర్యాటకులను వాటర్ ఫాల్స్ వద్దకు కట్టడి చేసేందుకు హెచ్చరిక బోర్డులతో పాటు ఎర్ర జెండాలను ఎగరేశారు.