jobmela
తెలంగాణ ముఖ్యాంశాలు

మేగా జాబ్ మేళాలో పాల్గోన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ బోయిగూడా, రైల్ కళారంగ్ లో జరిగిన 7వ “రోజ్ గార్ మేళా” కార్యక్రమంలో కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ఐటి, బ్యాంకింగ్, పోస్టల్ రంగాలతో పాటు మొత్తం 10 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 176 మందికి కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. నేడు 7వ రోజ్గార్ మేళా కాగా.. నేటితో కలుపుకుని 5లక్షల పైగా మంది యువకులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏకకాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారి.  

యూత్ పాపులేషన్లో భారతదేశం నెంబర్ వన్.. అనేక అంతర్జాతీయ, సాఫ్ట్వేర్ సంస్థలకు సీఈవోలు భారతీయులు. యువత మేధస్సు ద్వారా రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేలా భారత్ తయారు కానుంది. ఉద్యోగాలు వచ్చిన వారు అంకితభావంతో దేశం కోసం పని చేయాలి. తల్లిదండ్రులను మరిచిపోవద్దని అన్నారు.