ఓటరు రీ వెరిఫికేషన్ కార్యక్రమంలో బూతు లెవెల్ ఆఫీసర్లతో టిడిపి పార్టీ ఏజెంట్లు కలిసి ఓటరు రీవెరిఫికేషన్ సక్రమంగా జరిగేలా చూడాలని టిడిపి బూతు లెవల్ ఏజెంట్లు మరియు క్లస్టర్ ఇన్చార్జిలను మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు.
గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ పరిధిలోని బూతు లెవల్ ఏజెంట్లు మరియు క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలతో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఓటర్ లిస్టులో ఉన్న ఆవకతావకలపై చర్చించారు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు రివెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుందని దీనిలో బూతు లెవెల్ ఆఫీసర్లతో పార్టీకి సంబంధించిన బూతు ఏజెంట్లు కలిసి వెరిఫికేషన్ చేస్తారని తెలిపారు. బూతు లెవల్ ఆఫీసర్లు ఒత్తిళ్లకు లొంగకుండా అవకతవకలు లేకుండా వెరిఫికేషన్ చేయాలని గత ఓటరు లిస్టులో పలువురు మృతి చెందిన ఓట్లు ఉన్నాయని అటువంటివి జరగకుండా చూడాలని కోరారు.
ఎక్కడైనా ఎన్నికల ప్రక్రియలో వాలంటరీల పాల్గొంటే వారిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బూతు ఏజెంట్లు కూడా గమనిస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్,బిల్లు చెంచురామయ్య, పులిమీ శ్రీనివాసులు, ఇజ్రాయిల్ ,శివకుమార్ ,పట్టాభి రెడ్డి ,నరసింహులు ,మట్టం శ్రావణి ,భారతి, శ్రీదేవి, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు .